కల్లూరు అర్బన్ 28వ వార్డు ఓర్వకల్లు మండలం రైతులకు రూ. 9.8 లక్షల విలువైన డ్రోన్‌లను 80% సబ్సిడీతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గురువారం పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో కిసాన్ డ్రోన్ కీలకమని పేర్కొన్న ఆమె, శ్రమ తగ్గింపుతో పాటు సమయాన్ని ఆదా చేయడంలో ఇది రైతులకు మేలు చేస్తుందని తెలిపారు.