దొడ్డిపాడులో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 'సుపరిపాలనలో తొలి అడుగు'లో భాగంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. ప్రజలు కొత్త ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎంపీడీఓ నాగశేచల రెడ్డి, డీఈ నాగిరెడ్డి, ఏఈ రవిమోహన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.