పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కల్లూరు అర్బన్ 32వ వార్డులో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా గురువారం పర్యటించారు. ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కూరగాయలు విక్రయించే మహిళతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తామని తెలిపారు.