పాణ్యం: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పాణ్యం నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అనంతరం సభలో, సూపర్ సిక్స్ హామీలు, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, రైతులకు గిట్టుబాటు ధరల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్