ప్యాపిలి: కోడి పందేలపై పోలీసుల దాడులు – ఐదుగురు అరెస్ట్

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో ఆదివారం ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు కోడి పందెం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెనుగొండ రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, మఠాకుల రామకృష్ణతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 బైక్‌లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్