ప్యాపిలి: రౌడీషీటర్లకు ఎస్సై నాగార్జున హెచ్చరిక

ఆదివారం ప్యాపిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు ఎస్సై నాగార్జున కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వదిలి సన్మార్గంలో నడవాలని, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు నేర నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్