ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా 19వ వార్డ్ రవీంద్ర స్కూల్ వద్ద శుక్రవారం లబ్ధిదారులకు పింఛన్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అందజేశారు. వైసీపీ ఐదేళ్లు తీసుకున్న పని, కూటమి ప్రభుత్వం ఒక్క నెలలో చేసింది అన్నారు. అవ్వ తాతల కళ్లలో ఆనందమే ప్రభుత్వానికి మద్దతు సూచిక అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.