కర్నూలు, మంత్రాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ, ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీ అల్లర్లు, గొడవల రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రౌడీ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని, పార్టీ శ్రేణులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.