పందిపాడు: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, శనివారం కల్లూరు మండలం పందిపాడు గ్రామంలో ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పాస్ పుస్తకాలలో క్యూఆర్ కోడ్‌తో భూ వివరాలు భద్రంగా ఉంటాయని, వీటిని ఇతరులు డూప్లికేట్ చేయలేరని తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, జాయింట్ ఎల్పిఎం వంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్