కల్లూరు అర్బన్ పరిధిలోని సెరీన్ నగర్ 30వ వార్డులో సమస్యలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ నగర నాయకులు జి. యేసు రాజు మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి మెయిన్ రోడ్డు వరకు సెంటర్ వీధిలైట్లు నెల రోజులుగా వెలిగించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అధికారులను వెంటనే జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.