కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, కారుణ్య నియామకాల కింద ఏపీఎస్ఆర్టీసీలో 24 మందికి కండక్టర్ ఉద్యోగాలు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, క్రమశిక్షణతో పనిచేస్తూ అనుభవాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో పదోన్నతులు పొందాలని అభ్యర్థులకు సూచించారు. తమ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.