వర్చువల్ మహానాడు–2026 రెండో రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం గడివేముల మండల కేంద్రంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.