ఓర్వకల్లు మండలంలోని కన్నమడకలలో సోమవారం కత్తి దాడి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి, కట్టెల వివాదంలో గ్రామస్థులైన బోయ రమేష్, శివకృష్ణ, శివరాముడులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పద్మావతి తన కల్లం నుంచి కట్టెలు తీసుకెళ్లారని వెంకటేష్‌పై ఆరోపణలు చేయగా, ఆమె కుమారుడు మహేష్ వెంకటేష్‌ను నిలదీశాడు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గ్రామస్థులు సూచించగా, ఆగ్రహించిన మహేష్ వారిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.