హుసేనాపురంలో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మంగళవారం ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో దాసరి మహేష్ (33) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో విద్యుత్ మరమ్మతుల కోసం ఇనుప నిచ్చెనను తీసుకెళ్లిన మహేష్, పని పూర్తయ్యాక దాన్ని తిరిగి అప్పగించేందుకు ఆటోలో తీసుకువస్తుండగా, నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘోరం జరిగింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలిపోయిన అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్