కాల్వబుగ్గ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు మైదుకూరు వాసులు అయిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. కారులో కుటుంబ సభ్యులతో మైదుకూరు వెళ్ళే రహదారిలో ముందు బండాల లోడ్ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్