పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీకి సోమవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సార్బీసీ ఇన్చార్జి ఎస్ఈ సుభకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 14న గోరుకల్లు ఓటీ ద్వారా నీటిని విడుదల చేస్తామని, ప్రస్తుతం గోరుకల్లు జలాశయంలో మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాల్వల మరమ్మతులు పూర్తయ్యే వెంటనే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు.