ఆదోని జిల్లా సాధన జేఏసీ పత్తికొండలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ కన్వీనర్ గా, బురుజుల నాగభూషణం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పట్టణ ప్రముఖులు, సంఘాల నాయకులు ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని పత్తికొండలో బలంగా ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. సోమవారం నుంచి దీక్షలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్, సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.