ఆలంకొండ: క్రిష్ణగిరి తహసీల్దార్‌ను సస్పెన్షన్ చేయాలి

క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన రైతు బోయ ధనుంజయ్య పొలం నుండి అక్రమంగా కాలువ తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన క్రిష్ణగిరి మండల తహసిల్దార్ ప్రకాష్ బాబును సస్పెండ్ చేయాలని బుధవారం డిమాండ్ చేశారు. 75 సెంట్ల సాగు భూమి ఉన్న సర్వే నంబర్ 88/1, 88/2లో అక్రమంగా కాలువ ఇవ్వడంపై ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి, అనుమతి రద్దు చేయాలని కోరారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్