శభాష్ పురంలో టీడీపీ వర్గీయుల దాడి.. ఇరువర్గాలపై కేసు

తుగ్గలి మండలంలోని శభాష్ పురంలో వైఎస్సార్సీపీ వర్గీయుడు తిమ్మరాజు, టీడీపీ వర్గీయుడు చక్రాల్ల రంగస్వామి మధ్య రెండు రోజుల క్రితం మద్యం విక్రయంపై వివాదం విషయంలో సోమవారం ఘర్షణ మళ్లీ చెలరేగింది. మొహర్రం పండుగ ముగిసిన అనంతరం టీడీపీ వర్గీయులు తిమ్మరాజు ఇంటిపై దాడి చేసి మహిళలను కర్రలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారని తుగ్గలి ఎస్సై బాలనరసింహులు తెలిపారు.

సంబంధిత పోస్ట్