కర్నూలు, పత్తికొండ ప్రాంతాల ఆటో డ్రైవర్లు తమ సహచరుడు పైపాడు శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలిచారు. గత వారం గుండెపోటుతో మరణించిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబం పేదరికం కారణంగా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలివేయడంతో, సిఐటియు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ ఆధ్వర్యంలో డ్రైవర్లందరూ కలిసి ఐకమత్యంతో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన మానవత్వాన్ని చాటింది.