వెల్దుర్తి 2వ అంగన్వాడీ సెంటర్‌లో శుక్రవారం తల్లిపాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వెల్దుర్తి ప్రాజెక్ట్ సీడీపీవో లుక్, సూపర్ వైజర్ పద్మావతి నేతృత్వం వహించారు. బాలింతలు, గర్భవతులకు తల్లిపాలు, వాటి పోషక విలువల గురించి అవగాహన కల్పించారు. డబ్బాపాలు వద్దని, చిన్నపిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని పద్మావతి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, పిల్లలు పాల్గొన్నారు.