వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదివారం బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ పేరిట సమావేశం నిర్వహించనున్నట్లు శనివారం తెలిపారు. కల్లూరు అర్బన్ పరిధిలోని పందిపాడు వద్ద టీజీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో కల్లూరు గ్రామీణ, 16 వార్డుల వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని రాంభూపాల్ రెడ్డి కోరారు.