తుగ్గలి మండల కేంద్రంలోని శ్రీరామ దేవాలయం కమ్యూనిటీ హాల్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దిన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల అధ్యక్షుడు లక్ష్మన్న టైలర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలకు సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల బాధ్యతలపై బీజేపీ ఓబీసీ మాజీ జిల్లా అధ్యక్షుడు మాలేకర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి వాల్మీకి బ్రహ్మయ్య కార్యకర్తలకు సూచించారు.