తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామం సమీపంలో బొందిమడుగుల రమేష్ మాదిగపై కొంతమంది దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం స్థానికుల సమాచారం మేరకు గ్రామంలోని బొంతిరాళ్ల రోడ్డులో వాకింగ్ చేస్తున్న రమేష్ మాదిగపై కొంతమంది ముస్లిం యువకులు, ఇతరులు కలసి ట్రాక్టర్ తో ఢీ కొట్టి, రాడ్లతో దాడి చేసి పరారయ్యారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.