వెల్దుర్తిలో రైలు ఢీకొని వ్యాపారి మృతి

మంగళవారం వెల్దుర్తి సమీప రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని నార్లాపురం గ్రామానికి చెందిన కొండేటి భాస్కర్ నాయుడు (55) మృతిచెందాడు. భాస్కర్ తన సోదరులతో కలిసి వెల్దుర్తిలో ఆటోమొబైల్ షాపుతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసేవాడు. ప్రతిరోజు మాదిరిగానే వాకింగ్‌కు వెళ్లి పట్టాలు దాటుతుండగా, డా. బీఆర్ అంబేడ్కర్ నగర్ నుంచి బెంగళూరు యశ్వంత్‌పూర్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్