పత్తికొండలో ఆటో కార్మికుల సమావేశం

పత్తికొండ పట్టణంలో సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర ఆటో కార్మికులతో శనివారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కోడ్లను తక్షణమే రద్దుచేసి, పాత 29 చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ల వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అన్నారు. జనవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్