పత్తికొండ పట్టణంలోని స్థానిక కుమ్మరి వీధిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గోపాల్ అధ్యక్షత వహించగా, జిల్లా సిఐటియు అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్తిపండు, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర సమీక్ష నిర్వహించారు. సిఐటియు అన్ని రంగాల కార్మికులకు అండగా ఉంటుందని రాధాకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లక్ష్మి, సావిత్రిబాయి, పావని, వెంకటేశ్వరమ్మ, చంద్ర, అంజనమ్మ, హుస్సేన్, ప్రభాకర్, దుర్గన్న, శేఖర్ పాల్గొన్నారు.