తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన చాంద్ బాషా, ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లా రోల్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్-2 ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. తల్లిదండ్రుల కష్టార్జితమే ఈ విజయం సాధించడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.