కర్నూలు: జిల్లాలో 3,502 వితంతు కుటుంబాలకు పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కర్నూలు జిల్లాలో 3, 502 మంది వితంతువులకు కొత్తగా పెన్షన్ లు మంజూరు చేసి, రూ. 1. 40 కోట్లు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పత్తికొండ మండలం దూదేకొండలో గౌరమ్మ, రామాంజినమ్మ, షేకమ్మ, సంజమ్మ, రంగమ్మ, మద్దిలేటమ్మలకు వితంతువు పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ అందజేశారు.

సంబంధిత పోస్ట్