పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం 15వ వార్డుకు చెందిన జరదొడ్డి గంగమ్మ (61) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొంత మెరుగుపడినప్పటికీ, మళ్లీ గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మృతురాలి కుమారులు, కోడళ్ళు, మనవాళ్లు సంతాపం వ్యక్తం చేయగా, గ్రామస్థులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.