కర్నూలులో ఏబీఎన్ ఆఫీసు వద్ద మాజీ ఎమ్మెల్యే నిరసన

కర్నూలు నగరంలో బుధవారం, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా, అసభ్యకరంగా ప్రసారం చేసిన కథనాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్, రాష్ట్ర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. నిరసనకారులు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి, రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులను తగలబెట్టారు.

సంబంధిత పోస్ట్