పగిడిరాయి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో రూ. 3 లక్షలు మోసం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశాడని తుగ్గలి మండలం పగిడిరాయి కొత్తూరు గ్రామానికి చెందిన హరీష్ చంద్ర జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన మల్లికార్జున తన కుమారుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ. 3 లక్షలు తీసుకున్నాడని, అయితే ఉద్యోగం ఇప్పించకుండా కేవలం ల్యాప్‌టాప్ మాత్రమే ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని హరీష్ చంద్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్