కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బుధవారం సాయంత్రం కురిసింది. ఈ వర్షం పత్తి, టమోటా పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, అధికారులు వర్షం సమయంలో చెట్లు, షెడ్లు, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.