కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న 15 ఏళ్ల జండా అంగి అనే బాలుడు అదృశ్యమైనట్లు సోమవారం వార్డెన్ వెంకటేశ్వర్లు తెలిపారు. భోజనం తర్వాత గ్రౌండ్‌కు వెళ్లిన బాలుడు సాయంత్రం హాజరు సమయంలో కనిపించలేదు. తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణమూర్తి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కనిపిస్తే 9121101117, 9121101114 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.