తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ శివారులో బుధవారం వృద్ధుడు స్వర్ణయ్యపై దాడి జరిగింది. ప్రకాశం జిల్లా బోగనంపాడు గ్రామానికి చెందిన స్వర్ణయ్య వజ్రాల వేటకు వచ్చిన సమయంలో కొంతమంది అతనిపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంతో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.