కృష్ణగిరి మండలం చుంచుఎర్రగుడిలో విషాదం నెలకొంది. ఆదివారం గ్రామానికి చెందిన శిరోల్ల రవితేజ (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆయనకు ఇటీవలే కల్లూరు మండలం చిన్నటేకూరులో వివాహ నిశ్చయం జరిగింది. అయితే, బెంగళూరులో రవితేజ తన బంధువుతో బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి అతనితో పాటు మరొక వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో బెంగళూరుకు వెళ్లారు.