భూసారాన్ని పెంచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సహజ వ్యవసాయంపై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మండలానికి కనీసం 10 హాఫ్ మూన్ మోడళ్లు ఏర్పాటు చేయాలని, పీఎఫ్ఓల ద్వారా యంత్రాలు, విత్తనాలు, మార్కెట్ పరిశీలనలో సహాయం చేయాలని సూచించారు. మల్లె, మామిడి, అరటి, దానిమ్మ వంటి పంటల వృద్ధితో రైతుల ఆదాయం పెరుగుతుందని, వరి పంటను తగ్గించి లాభదాయక పంటలకు ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు.