కర్నూలు: గ్రంథాలయ ఛైర్మన్ గా తుగ్గలి నాగేంద్ర ప్రమాణస్వీకారం

పత్తికొండ నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు తుగ్గలి నాగేంద్ర ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ శాఖ ఛైర్మన్ గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పాల్గొని నాగేంద్రను అభినందించారు. నాగేంద్ర మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి శక్తివంతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మాజీ శాలివాహన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకుడిగా నాగేంద్ర నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్