లక్ష్మీనగరం: గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులకు తీవ్రనష్టాలు

బుధవారం వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామంలో మామిడి రైతులను పరామర్శించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ. గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెడితే, ప్రస్తుతం రూ. 30 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూతరాలిపోవడం, వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గిందని, గతంలో రూ. 1500-2000 పలికిన 20 కేజీల బాక్స్ ఇప్పుడు రూ. 300-400కే అమ్ముడుపోతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్