పత్తికొండ కోర్టు ఘటనపై న్యాయవాదుల ఆగ్రహం

పత్తికొండ కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన ముద్దాయిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ఆదోని న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇలాంటి వ్యవహారం న్యాయవ్యవస్థ గౌరవాన్ని భంగపరిచిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆదోని బార్ అసోసియేషన్ జిల్లా జడ్జి పీజే సుధకు వినతిపత్రం అందజేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్