ఎం. అగ్రహారం: ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన మాబున్ని (31) చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంజాన్ పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్తుండగా జరిగిన ఆటో ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లింది. వారం రోజులుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి భర్త మహమ్మద్ రఫీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్