మద్దికెర మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. ఐదు తరగతులకు ఒక్క విద్యార్థి, ఒక్క ఉపాధ్యాయిని ఉన్నారు. ఒకానొక కాలంలో ఇక్కడ 170 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. వలసలు, కార్పొరేట్ బడుల ప్రభావంతో పిల్లల సంఖ్య తగ్గింది. గ్రామస్థులు మొహర్రం సమయంలో మాత్రమే వస్తుంటారని ఉపాధ్యాయిని ఉషారాణి తెలిపారు.