మద్దికెర: కొడుకును చూసి వస్తూ మృత్యుఒడికి

తన కుమారుడిని కళ్లారా చూసి మురిసిపోయాడు తిరుపతిరావు. రెండు నెలల క్రితం పుట్టిన శిశువును చూడటానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మద్దికెర-బురుజుల రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వంతెన గోడను ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాకు చెందిన రాశితో గతేడాది తిరుపతిరావుకు వివాహం జరిగింది. తాజా ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్