తుగ్గలి మండలం మారెళ్ళ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్‌గా వైవి ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్లుగా బొందిమడుగుల మోహన్, రాంపల్లి శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సొసైటీ సీఈవో మనోహర్ నాయుడు సొసైటీ ఉద్యోగులు, మాజీ సర్పంచ్ మసాలా శీను, టిడిపి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.