పత్తికొండ తాలూకాలో కొత్త ఏపీ జేఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ ప్రెసిడెంట్ ఆస్పరి సాయిబాబు నూతన చైర్మన్‌గా, టిఎండి హుస్సేన్ వైస్ చైర్మన్‌గా, బాబురావు పెన్షన్స్ అసోసియేషన్, ఆవుల నాగరాజు జనరల్ సెక్రటరీగా, ప్రసాద్ బాబు జాయింట్ సెక్రటరీగా, సంజీవుడు (ఎపిటిఎఫ్) ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు 8 మంది ఈసీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఉద్యోగుల పిఆర్సి, డిఏలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం రాబోయే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సభ్యులు పిలుపునిచ్చారు.