ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: లబ్ధిదారుల కృతజ్ఞతలు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పీఎం తాండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎస్టీ సెల్ బంజారా నాయకుడు ఎం. రవీంద్రనాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అత్యంత పారదర్శకంగా పెన్షన్ నగదును అందజేస్తున్నారని, ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించడానికి ఈ పెన్షన్లు తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 1న జరిగింది.

సంబంధిత పోస్ట్