కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం పత్తికొండలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, మందుల గడువు తేదీలు, ల్యాబ్ పరీక్షలు గురించి సమీక్షించారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వైద్యులను ఆదేశించారు. ఆర్డీవో భరత్ నాయక్ ఉన్నారు.