పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన రంగస్వామి (40) బుధవారం అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వల్లే ఆయన మరణించారని మృతుడి భార్య, బంధువులు ఆరోపించారు. రంగస్వామి పెయింటర్ గా పనిచేస్తుండగా, అస్వస్థత కలిగినప్పుడు ఆర్ఎంపీ వైద్యుడి సూచనతో ఇంజక్షన్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరింత అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.