పత్తికొండ: 12 మండలాల్లో వర్షాలు.. నందవరంలో 69.8 మి.మీ

కర్నూలు జిల్లాలో మంగళవారం 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో అత్యధికంగా 69.8 మి. మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 32.2, అర్బన్‌లో 25.4, కల్లూరులో 23.2 మి. మీ వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ అధికారులు 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్