కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్, వైఎస్ఆర్ పార్టీ బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. ఈ దాడిని రాష్ట్రంలో అటవీక పాలనకు నిదర్శనంగా పేర్కొన్న ఆమె, టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే హారిక వాహనంపై దాడి చేసినట్లు వివరించారు. ఇలాంటి చర్యలు కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలనలో భాగమని విమర్శించారు.